Kalki 2898AD: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,April 06 2024]

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ ఏడాది వేసవి కానుకగా మే9న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుడంటం.. అలాగే కొన్ని ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ జూన్ 1వరకు పోలింగ్ జరగనుంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.

ఎందుకంటే ఎన్నికల సమయంలో విడుదల చేస్తే సినిమా చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రారు. అందరూ ఎన్నికల మూడ్‌లో ఉంటారు.. తమకు నచ్చిన పార్టీల గెలుపు కోసం తీవ్రంగా పనిచేస్తూ ఉంటారు. ఆ సమయంలో విడుదలై హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఎన్నికల వేళ పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు. ఈ క్రమంలోనే 'కల్కి' రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. అయితే ఎక్కువ రోజులు వాయిదా వస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన మేకర్స్ కొత్త విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మే 30వ తేదీని మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసి ఎన్నికల హడావిడి తగ్గుతుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదని భావిస్తున్నారు. అందుకే ఆ తేదీన విడుదల చేయనున్నట్లు ఉగాది పండుగ కానుకగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది.
మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని తెలిపారు. ఇందులో డార్లింగ్ గెటప్ కూడా కొత్తగా ఉంది. పిలకతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రభాస్ లుక్ ఉంది.

కాగా ఇటీవల నాగ్ అశ్విన్ ఈ కథ గురించి మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More News

కాంగ్రెస్‌లో చేరికల జోరు.. షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్మే..

ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తుంది. నాయకుల ప్రచారాలతో రాష్ట్రమంతా మైకులతో మార్మోగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త ఇల్లు ఇదే.. ఏ గ్రామంలో అంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు

Pawan Kalyan: జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్.. తిరిగి ప్రచారం మొదలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో వారాహి విజయభేరి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

Kavitha: కవితకు వరుస ఎదురుదెబ్బలు.. సీబీఐ విచారణకు కోర్టు అనుమతి..

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కవితను విచారిస్తామని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.

తెలంగాణలోని అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత

తెలుగు రాష్ట్రాల్లో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవినీతిపరులందరూ ఆ పార్టీలోనే ఉంటారు.