ధనుష్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో ఛాన్స్..

  • IndiaGlitz, [Friday,December 18 2020]

ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్. ధనుష్‌కు అద్భుతమైన అవకాశం దక్కంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని ఈ తమిళ్ హీరో దక్కించుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ థ్రిల్లర్ ది గ్రే మ్యాన్ తారాగణంలో ధనుష్ కూడా చేరిపోయాడు. వాగ్నర్ మౌరా, జెస్సికా హెన్‌విక్, జూలియా బట్టర్స్‌తో పాటు ధనుష్ కూడా రూసో బ్రదర్స్.. ‘ది గ్రేమ్యాన్’లో కీలక పాత్రల కోసం సైన్ చేసినట్టు గురువారం నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ ఇంతకు ముందు రూసో బ్రదర్స్ దర్శకత్వంలో నటించారు.

ది గ్రే మ్యాన్ అనేది మార్క్ గ్రీనీ 2009లో రాసిన నవల ఆధారంగా.. అదే పేరుతో రూపొందనుంది. అయితే ధనుష్ పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. లాయిడ్ హాన్సెన్ ఎవరి కోసమైతే ప్రపంచ వ్యాప్తంగా వేటాడాడో ఆ జెంట్రీ పాత్రను ర్యాన్ గోస్లింగ్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా.. ధనుష్ నటించబోయే రెండవ అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 2018లో ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ధనుష్ నటించాడు.

More News

పెన్నానదిలో 7గురు విద్యార్థుల గల్లంతు.. 4 మృతదేహాలు లభ్యం

స్నేహితుడి ఇంట కర్మకాండకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు.. సరదాగా పెన్నానదికి వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు.

డ్ర‌గ్స్ కేసు.. క‌ర‌ణ్ జోహార్‌కు నోటీసులు

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మందికి ఇబ్బందిగానే మారింద‌ని చెప్పాలి.

హీరోకు 50... హీరోయిన్‌కు 19 ఏళ్లా?: దియా మీర్జా

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ అడగొద్దు: హైకోర్టు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు..

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ ‘ఎఫ్ 3’ ప్రారంభం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’.