కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునే వార్త!

  • IndiaGlitz, [Thursday,June 03 2021]

కోవిడ్ 19 సంక్షోభం అన్ని రంగాల ప్రజలపై ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతవరకు కోవిడ్ ప్రభావానికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే కోవిడ్ కారణంగా ప్రభుత్వం మూడు విడతల డీఏ పెంపుని వాయిదా వేసింది.

వాటిని అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ అమలులో ఉంది. గత ఏడాదిన్నరగా డీఏ అమలులో లేదు కాబట్టి తాజాగా మరో 11 శాతం పెరగనుంది.

అంటే మొత్తం 28 శాతం డీఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. దీనితో వారి వేతనాల్లో మార్పు గణనీయంగా కనిపించనుంది. జులై 1 నుంచి ప్రభుత్వం వీటిని అమలు చేయనుంది. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.