ఏపీ ప్రజలకు జగన్ శుభావార్త.. నవంబర్ 1 నుంచి..!

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి వరాలజల్లు కురిపించారు. శుక్రవారం నాడు ఆరోగ్యశాఖపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా.. శస్త్ర చికిత్సలు చేయించుకున్న వ్యక్తి కోలుకునేవరకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా.. 150 ఆసుపత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 1 నుంచి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునే వరకు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జగన్ నిర్ణయంతో ఎవరికి లాభం!

కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10 వేలు సాయం

రూ. 5 వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చారు.

పనిచేయలేని స్థితిలో ఉన్న వారికి రూ.5 వేల పింఛన్‌ వర్తింపు

మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని రావాలని ప్రయత్నాలు

ఇదిలా ఉంటే.. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. అంతేకాకుండా.. అన్ని ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు 2020 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బోధనాసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింజేయాలని తెలిపారు.వైద్యరోగ్యశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. సీఎం చెప్పారు సరే మరి పైన చెప్పినవన్నీ ఏ మేరకు ఆచరణలోకి వస్తాయో వేచి చూడాల్సిందే మరి

More News

మరోసారి అదే డైరెక్టర్ తో మహేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అయితే మ‌హేశ్‌కి మాత్రం న‌చ్చిన ద‌ర్శ‌కులు కొంత మందే.

రామ్ ‘డబుల్’ ప్రయత్నం ఫలించేనా!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఊహించని హిట్టవ్వడంతో కుర్ర హీరో రామ్ మంచి ఊపు మీదున్నాడు.

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం..

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు,