పోలవరంపై ఉదయం షాకింగ్.. సాయంత్రం గుడ్ న్యూస్!
- IndiaGlitz, [Friday,November 08 2019]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరంపై గత కొన్ని రోజులుగా ఇటు కోర్టులు... అటు కేంద్రం బ్రేక్లు వేస్తూనే ఉన్నాయ్. అంతేకాదు రివర్స్ టెండరింగ్లో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయినప్పటి నుంచి షాకింగ్ న్యూస్లు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు పోలవరం హైడల్ ప్రాజెక్ట్ పనులు ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ నవయుగ పిటిషన్పై సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం మాత్రం శుభవార్త తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులో రూ. 1850 కోట్లు విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ. 5600 కోట్ల బకాయిలకు గాను.. రూ. 1850 కోట్లకు కేంద్రం విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మిగిలిన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కాగా.. గత ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 5600 కోట్లకు సంబంధించిన బిల్లులపై పరిశీలన అనంతరం డీపీఆర్-1 మేరకు పెండింగ్ బిల్లులో కొంత మేర క్లియర్ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఇవాళ ఏపీ సర్కార్కు ఒకింత శుభవార్త తెలిపింది.