గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్!
- IndiaGlitz, [Friday,July 03 2020]
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నీ ఓకే అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ పేరిట కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేసేందుకు భారత్ బయోటెక్‌తో కలిసి పని చేస్తున్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఇప్పటికే ప్రి క్లినికల్ దశను పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ రెండు, మూడో దశలకు సిద్ధమవుతోంది.
అయితే క్లినికల్ టెస్టుల్లో కరోనాను ఈ వ్యాక్సిన్ నివారించగలిగితే ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ సిద్ధమైనట్టే. కాగా.. క్లినికల్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ దేశంలోని 12 హాస్పిటళ్లను ఎంపిక చేసుకుని.. వాటికి లేఖ కూడా రాసింది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని ఐసీఎంఆర్ హాస్పిటళ్లను కోరింది. మనుషులలో కోవాక్సిన్ పరీక్షలు విజయవంతమైతే.. కరోనాకు సమర్థవంతమైన తొలి వ్యాక్సిన్‌గా ఇది నిలవనుంది.