గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్.. తెలంగాణ నుంచే తొలి వ్యాక్సిన్!

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

కరోనా నిరోధానికి తొలి అడుగు తెలంగాణ నుంచే పడబోతోందా? అంటే అవుననే అంటోంది ‘భారత్ బయోటెక్’. ఈ సంస్థ రూపొందించిన ‘కోవ్యాక్సిన్’ అనే కరోనా నిరోధక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సినే తొలి దేశీయ వ్యాక్సిన్ కావడం విశేషం.

దీనిపై భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ సహకారంతో జాతీయ నియంత్రణ మండలి ప్రోటోకాల్స్‌ను వేగవంతం చేయడం వల్లే ప్రీ క్లినికల్ అధ్యయనాన్ని విజయవంతం చేశామని తెలిపారు. జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. సక్సెస్‌ అయ్యింది. దీంతో డ్రగ్‌ కం ట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) రెండో దశ ప్రయోగాలకు అనుమతినిచ్చింది. వచ్చే నెలలోనే మొదటి.. రెండో దశ పరీక్షలను మనుషులపై నిర్వహించనున్నట్టు భారత్ బయోటెక్ తెలిపింది.