Women Bus Travel Free:మహిళలకు శుభవార్త.. రేపటి నుంచే బస్సుల్లో ఉచిత ప్రయాణం..

  • IndiaGlitz, [Friday,December 08 2023]

తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపు(శనివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తామన్నారు. మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది చరిత్రాత్మక నిర్ణయమని.. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుందన్నారు.

జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌.. హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుందన్నారు. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడెంటీ కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చన్నారు. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇస్తామని ఆయన చెప్పారు. వారం రోజుల తర్వాత ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా జీరో టికెట్‌ ప్రింటింగ్‌ చేస్తామన్నారు. కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర బస్సుల్లో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.

తెలంగాణ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు అయినా మహిళలు ఉచితగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. మహిళలకు సంబంధించిన ఛార్జీలను రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుందని పేర్కొన్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని.. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని సజ్జనార్‌ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. రేపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తుంది.

More News

నిరుద్యోగులకు మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ(APPSC)..

MP Moitra:టీఎంసీ ఎంపీ మొయిత్రాపై బహిష్కరణ వేటు.. విపక్షాల ఆగ్రహం..

పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది.

Chandrababu:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు.

Akbaruddin Owaisi:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

రేపటి(శనివారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దీంతో అసెంబ్లీ తొలి సమావేశాల ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ నియమితులయ్యారు.

Former CM KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు సొంతింటి కష్టాలు.. ఎక్కడుండాలి..?

ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సీఎం హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్‌కు