DSC:నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

  • IndiaGlitz, [Thursday,February 29 2024]

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

మొత్తం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000 ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. డీఎస్సీ దరఖాస్తుకు అభ్యర్థుల వయోపరిమితి 46 ఏళ్లుగా నిర్ణయించారు.

గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని పోస్టులను కలుపుతూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

More News

Mudragada and Jogaiah:పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ, జోగయ్య.. మీకో దండం అంటూ లేఖలు..

తాడేపల్లిగూడెం సభలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: జగన్‌ నువ్వే నా నాలుగో పెళ్లాం.. పవన్ కల్యాణ్‌ ఘాటు విమర్శలు..

సీఎం జగన్ తన నాలుగో పెళ్లామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన మూడు పెళ్లిళ్లపై జగన్ చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Chandrababu: టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్.. వైపీపీ పాలన అట్టర్ ఫ్లాప్‌: చంద్రబాబు

టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్ అని.. వైపీపీ పాలన అట్టర్ ఫ్లాప్‌ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగుజన విజయ కేతనం’ జెండా భారీ బహిరంగ సభ నిర్వహించారు.

YS Sharmila: ప్రధాని మాట ఇచ్చిన తిరుపతిలోనే హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తాం: షర్మిల

ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ కీలక హామీ ఇచ్చింది. మార్చి ఒకటో తేదిన తిరుపతిలో నిర్వహించబోయే సభలో హోదాపై డిక్లరేషన్ చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.

Jamili Elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. రాజ్యాంగంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం..!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల హడావిడి నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.