Telangana Good News:తెలంగాణ ఆడబిడ్డలకు శుభవార్త.. త్వరలోనే నగదుతో పాటు తులం బంగారం..

  • IndiaGlitz, [Saturday,January 27 2024]

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలుచేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు వంటి హామీలను అమలు చేస్తు్న్నారు. వచ్చే నెల నుంచి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ హామీ అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. 100 రోజుల్లోపే ఆరు గ్యారంటీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఎన్నికల్లో ఈ మేరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హామీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తు్న్నారు. ఇక రాష్ట్రంలో త్వరలోనే కులగణన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కులగణన చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కులాల సంఖ్య తేలితే దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించవొచ్చని భావిస్తున్నారు. వచ్చే నెలలోనే కులగణన ప్రారంభించాలని సూచించారు.

కాగా ఎన్నికల సమయంలో బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీటితో పాటు ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‍ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని.. ఆ భవనాల నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనాలు వేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

More News

CM Jagan:అభిమన్యుడిని కాదు అర్జునుడిని.. ఎన్నికల శంఖారావం పూరించిన జగన్..

ఉత్తరాంధ్ర వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని

Chandrababu:జగన్‌ని ఓడించేందుకు జనం కూడా సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించేందుకు జనం సిద్దంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

Upasana:తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణులు.. చాలా గర్వంగా ఉంది: ఉపాసన

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం పట్ల ఆయన కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన..!

సినిమాలకు రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు.

Sharmila: YCP అంటే వైవీ.. సాయిరెడ్డి.. రామకృష్ణారెడ్డి.. షర్మిల సెటైర్లు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సారే లేరని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇప్పుడు ఉన్నది YSR పార్టీ కాదని..