రియల్‌ఎస్టేట్ రంగానికి తియ్యటి శుభవార్త

  • IndiaGlitz, [Monday,February 25 2019]

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా అందరికీ శుభవార్తలు చెబుతూ వెళ్తోంది. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని ఎనలేని ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని మోదీ.. రైతులు మొదలుకుని రియల్‌ఎస్టేట్ వరకు అందరికీ తియ్యటి శుభవార్తలు చెబుతూ ‘ఆపరేషన్-2019’గా ముందుకెళ్తున్నారు. ఓ వైపు ప్రత్యర్థపార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కమల రథాన్ని మోదీ అండ్ షా పరుగులు పెట్టిస్తున్నారు.

రియల్‌ఎస్టేట్ రంగానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి తియ్యటి శుభవార్త చెప్పారు. గృహ కొనుగోలు దారులకు జీఎస్టీ నుంచి ఊరట కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణంపై జీఎస్టీ తగ్గించడం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 5శాతం జీఎస్టీ తగ్గించారు. కాగా ఇదివరకు ఇళ్లపై 12శాతం జీఎస్టీ ఉండేది.. దీంతో తాజాగా 5శాతం తగ్గించగా ఇకపై 7శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం జీఎస్టీ కౌన్సిల్‌‌ 33వ సారి సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా.. తాజా నిర్ణయం ప్రకారం రూ.45 లక్షల లోపు గృహాల కొనుగోలుపై జీఎస్టీ 1 శాతం వర్తిస్తుంది. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు.. ఇతర చోట్ల 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు ఇళ్ళను మధ్య ఆదాయ వర్గాల ఇళ్ళుగా వర్గీకరించాలని జీఎస్టీ కౌన్సిల్‌‌ నిర్ణయించడం విశేషం.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జైట్లీ.. అందరికీ ఇళ్లు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుంది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేయనున్నాం. అందుకు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం తోడ్పడుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన పట్ల ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

More News

క్షమాపణలు చెప్పి.. జగన్‌‌కు చింతమనేని సవాల్

పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ టార్గెట్ జగన్‌‌ కాదు.. ఆ ఆరుగురే!?

టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే పులివెందులలో ఎలాగో గెలిచేది లేదు..

అలీ పనైపోయింది.. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీనే!?

రాజకీయాల్లోకి రావాలన్న చిరకాల కోరిక తీర్చుకోవడానికి కమెడియన్ అలీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

వ‌న్ మెన్ ఆర్మీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

సందీప్ చీలంను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అను ప్రొడక్షన్స్ & మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా వ‌న్ మెన్ ఆర్మీ.

'సైరా', 'కాటమరాయుడు' గురించి పవన్ ఏమన్నారంటే...

టైటిల్ చూడగానే తమ్ముడు 'కాటమరాయుడు' ఆల్రెడీ చూసేశాం.. ఇక మిగిలింది చిరంజీవి 'సైరా'నే కదా అని అనుకుంటున్నారా..? ఇది మీరు అనుకుంటున్నట్లుగా ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు అస్సలు కానేకాదండోయ్