ప్ర‌భాస్‌కు ఊర‌ట‌

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

రాయ్‌దుర్గ్ ప‌న్మ‌క్త్ గ్రామంలో హీరో ప్ర‌భాస్ కోనుగోలు చేసిన భూమి ప్ర‌భుత్వ భూమి అంటూ.. అధికారులు దానికి తాళాలు వేశారు. ప్ర‌భాస్ దానిపై హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించి తీర్పునిచ్చారు. కోర్టు ప్ర‌కారం.. 60 ఏళ్లుగా కొన‌సాగుతున్న వంద‌ల ఎక‌రాల భూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని కోర్టు ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేసింది. ప్ర‌భాస్ స్వాధీనంలో ఉన్న భూమిని ఖాళీ చేయించ‌లేమ‌ని.. చ‌ట్ట విరుద్ధ‌మ‌ని చెప్పింది. అలాగే ప్ర‌భుత్వం నిర్దేశించిన విధివిధాల‌ను అనుస‌రించ‌లేమ‌ని చెప్పింది.

అలాగే 1958 నుండి ఇక్క‌డి భూముల‌పై వివాదం జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఆ భూమిని ప్ర‌భాస్‌కు స్వాధీనం చేయాల‌ని కూడా ఆదేశించ‌లేమ‌ని పేర్కొంది. భూ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ప్ర‌భాస్ ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటే ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు.. ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని హైకోర్టు తెలిపింది. ప్ర‌భాస్ ద‌ర‌ఖాస్తుల విషయంలో జారీ చేసే ఉత్త‌ర్వుల ఆధారంగా వంద‌ల ఎక‌రాల భూమిపై యాజ‌మాన్య హ‌క్కులు కోరుతూ మిగిలిన వారు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చున‌ని తెలిపింది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్‌ సేల్‌ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ఫీజు చెల్లిస్తే ఆ భూముల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌భుత్వాని వేల కోట్ల రూపాయ‌లు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని హైకోర్టు తెలిపింది. దీంతో హీరో ప్ర‌భాస్‌కు ఊర‌ట దొరికిన‌ట్ట‌య్యింది.

 

More News

పెళ్లి గురించి హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా!

తెలుగులో హ‌లోతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ఈ సినిమా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌కు

షాకిస్తున్న స‌మంత రెమ్యున‌రేష‌న్‌

గ‌త ఏడాది రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు చిత్రాల స‌క్సెస్‌లో త‌న వంతు పాత్ర పోషించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంది స‌మంత‌.

బ‌రువు త‌గ్గుతున్న సాయితేజ్‌

మెగా క్యాంప్ హీరో సాయి తేజ్ రీసెంట్‌గా విడుద‌లైన `చిత్రల‌హ‌రి`తో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

వైర‌ల్ అవుతోన్న స‌మంత ప‌ర్స‌న‌ల్ ఫోటోలు

స‌మంత అక్కినేని ఆనందానికి అవ‌ధులు లేకుండా ఉన్నాయి. `మ‌జిలీ` సినిమా గురించి ఈ అమ్మ‌డు ప‌డ్డ టెన్ష‌న్ అంతా దూర‌మైపోయింది.

మూడో విడత పోలింగ్ ముగింపు.. నంబర్ వన్‌లో బెంగాల్!

భారత దేశంలో మూడోదశ ఎన్నికలకు పోలింగ్ గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌‌లో 79శాతం నమోదవ్వడం రికార్డ్ బ్రేక్ చేసినట్లేనని చెప్పుకోవచ్చు.