Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,January 19 2024]

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సలార్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అది కూడా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. జనవరి 20న శనివారం నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖు ఓటీటీ సంస్ధ నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుంచి 'సలార్'స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేసింది. ఈ సినిమా మళ్లీ చూడాలనుకునే వారు, అసలు చూడని వారికి ఇది నిజంగా అదిరిపోయే వార్తే.

ఎందుకంటే గతేడాది డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అంటే విడుదలైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ మూవీలో ప్రభాస్‌ హీరోయిజం, ఆయనను స్క్రీన్‌పై చూపించిన తీరు అభిమానులను షేక్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ కటౌట్‌కు తగ్గ పాత్ర దొరికిందని మురిసిపోయారు. విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్‌బాస్టర్ టాక్ అందుకుంది. ఇక మూవీలోని కోటెరమ్మ ఫైట్ అయితే థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఖాన్సార్ పెద్దల సమక్షంలో జరిగే ఫైట్ కూడా విజిల్స్ వేయించింది. ముఖ్యంగా 'సలార్' ఎండింగ్ ట్విస్ట్ రెండో పార్ట్ మీద విపరీతమైన అంచనాలు పెంచింది. దీంతో కలెక్షన్స్ సునామీ సృష్టించింది.

మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.270కోట్లకు పైగా వసూలు బాక్సాఫీస్ దుమ్మురేపింది. విడుదలైన 10 రోజుల్లోనే రూ.600కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటివరకు రూ.720కోట్లు వచ్చినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి సినిమాలను కూడా తట్టుకుని థియేటర్లలో అక్యూపెన్సీ దక్కించుకుంది. దీంతో రూ.1000కోట్ల వసూళ్లు వస్తాయమో అని భావించారు. అయితే ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గడంతో ఆ రికార్డు సాధించడం కష్టమనే చెప్పాలి.

ఇక ప్రభాస్ తర్వాత సినిమాల విషయానికొస్తే 'సలార్' చిత్రానికి కొనసాగింపుగా 'సలార్-2' త్వరలోనే రానుంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈ ఏడాది మే 9వ తేదిన విడుదల కానుంది. ఇదే కాకుండా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చిత్రం హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగం పైగా పూర్తి అయింది. ఇవే కాకుండా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్, సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రం కూడా రానున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.

 

 

More News

Guntur Karaam:దుమ్మురేపిన మహేష్.. 'గుంటూరు కారం' తొలి వారం వసూళ్లు ఎంతంటే..?

సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్‌లో దుమ్మురేపింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా మహేష్ బాబు స్టామినాతో థియేటర్లకు

Dhanush Nagarjuna:ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభం

తమిళ స్టార్ హీరో ధనుష్‌.. తెలుగు సినిమా దర్శకులపై మక్కువ పారేసుకుంటున్నారు. ఇటీవల యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో

Kodali Nani:ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలన్న బాలకృష్ణకు కొడాలి నాని కౌంటర్

దివంగత సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు

Renuka Chaudhary:ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా.. ఆపే దమ్ము ఎవరికీ లేదు: రేణుకా చౌదరి

ఖమ్మం జిల్లా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi:చిరంజీవిని ముఖ్యమంత్రిగా చేస్తాం.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసింది. మరో నెల లేదా రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.