Sankranti:సంక్రాంతికి ఊరు వెళ్లేవారికి శుభవార్త.. 20 ప్రత్యేక రైళ్లు..

  • IndiaGlitz, [Friday,December 22 2023]

తెలుగు ప్రజలకు పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన ప్రజలంతా పండుగకు తప్పనిసరిగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో సికింద్రాబద్ నుంచి ఏపీకి వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊరు వెళ్లాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ(Railway Department) శుభవార్త అందించింది. పండుగ రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లు(Special Trains) కేటాయించినట్లు దక్షిణ మధ్య అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 26 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.

ప్రత్యేక రైళ్లు వివరాలు ఇవే..

కాచిగూడ - కాకినాడ టౌన్ (రైలు నెం - 07653)..

ఈ రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. ఈ నెల 28న (గురువారం) రాత్రి 8:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ - కాచిగూడ (రైలు నెం - 07654)..

ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రయాణిస్తుంది. ఈ నెల 29న (శుక్రవారం) సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

హైదరాబాద్ - తిరుపతి (రైలు నెం 07509)..

ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. గురువారం రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

తిరుపతి - హైదరాబాద్ రైలు (07510)..

ఈ రైలు డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. డిసెంబర్ 29 రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

కాచిగూడ - కాకినాడ టౌన్ - కాచిగూడ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07653/07654)..

మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07509/07510)..

సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ. నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

More News

Prabhas:ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్.. బ్లాక్‌బాస్టర్‌గా సలార్..!

బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నారు.

YS Jagan:అంగన్‌వాడీ వర్కర్లకు వైయస్ జగన్ ప్రభుత్వం శుభవార్త

అంగన్‌వాడీ వర్కర్లకు సీఎం జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని పది రోజులుగా

Gokul Chat:'గోకుల్‌ చాట్' అధినేత కన్నుమూత.. కోఠిలో విషాదఛాయలు.

హైదరాబాద్‌లోని 'గోకుల్‌ చాట్' గురించి తెలియని వారుండరూ అంటే అతిశయోక్తి కాదు. దేశంలోని ప్రఖ్యాతిగాంచింది.

Raghava Reddy:మాస్ అండ్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’... ఆకట్టుకుంటోన్న ట్రైలర్

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో

AP Govt:ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. విశాఖ నుంచి పరిపాలన లేనట్లే..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది.