ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్

  • IndiaGlitz, [Monday,October 26 2015]

గ‌త రెండేళ్లుగా ఏడాదికో సినిమాతోనే స‌రిపెడుతున్న ఎన్టీఆర్‌.. వ‌చ్చే ఏడాదిలో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న సుకుమార్ చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో' జ‌న‌వ‌రి 8న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. కొర‌టాల శివ‌తో చేస్తున్న కొత్త చిత్రం ఆగ‌స్టు 12న రిలీజ్ అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకోనుంది.

మొత్తానికి ఒకే ఏడాదిలో.. త‌క్కువ గ్యాప్‌లో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసేందుకు ఎన్టీఆర్ వేసిన ప్లానింగ్ అదుర్స్ అంటున్నారు ఆయ‌న అభిమానులు. 2013లో తార‌క్ నటించిన 'బాద్‌షా, రామ‌య్యా వ‌స్తావ‌య్యా'.. ఇలా రెండు సినిమాలు విడుద‌లయ్యాయి. అంత‌కు ముందు కూడా ఇలాంటి సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌ళ్లీ మూడేళ్ల త‌రువాత రెండు సినిమాల‌తో వ‌స్తున్న తార‌క్‌కి.. ఆయా సినిమాలు విజ‌యాలు అందించాల‌ని ఆశిద్దాం.