Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'దేవర' అప్టేడ్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Monday,January 01 2024]

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్టేడ్ వచ్చింది. మూవీ గ్లింప్స్ ఎప్పుడు విడుదల చేయనున్నారో చెబుతూ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తారక్.. బ్లాక్ డ్రెస్‌లో టక్ చేసుకుని పడవలో నిలబడి సీరియస్‌ లుక్‌లో ఉన్నారు. జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గతంలో ఎప్పుడు లేనంత భయంకరంగా ఉంటారని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో విపరీతమైన వయెలెన్స్ ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం విశేషం. కాగా ఎన్టీఆర్- కొరటాల కలయికలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నటుడిగా తారక్ మరో మెట్టు ఎక్కారు. వీరి కాంబోలో ఇప్పుడు 'దేవర' రానుండడంతో మూవీ సర్కిల్లో హై భజ్ ఏర్పడింది. మొదటి పార్ట్‌ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More News

ప్రజాపాలనతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ ప్రభుత్వం

ప్రజలకు కష్టాలు లేకుండా సులభంగా పథకాలు అందించడం ఏ ప్రభుత్వం పని తీరునైనా తెలియజేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా

Former DSP Nalini:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని.. ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Modi:అమృత భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు.

Tamilisai:రాజీనామా వార్తల్లో నిజం లేదు: గవర్నర్ తమిళిసై క్లారిటీ

తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్రంగా ఖండించారు.