IPL:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. 

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ 2024 షెడ్యూల్(IPL 2024 Schedule) వచ్చేసింది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ ప్రకటించారు. ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయని తెలిపారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా రెండు విడతలుగా టోర్నీని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తొలుత 15 రోజులకు షెడ్యూల్ ప్రకటిస్తున్నామన్నారు. ఇందులో మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొత్తం 21 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టుకు హోంగ్రౌండ్‌గా ‌వైజాగ్‌ను ఎంచుకోవడం విశేషం.

ఐపీఎల్ మొదటి షెడ్యూల్ ఇదే..

మార్చి 22 : చెన్నై వర్సెస్‌ బెంగళూరు – చెన్నై
మార్చి 23 : పంజాబ్‌ వర్సెస్‌ ఢిల్లీ – మొహాలీ
మార్చి 23: కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ – కోల్‌కతా
మార్చి 24 : రాజస్తాన్‌ వర్సెస్‌ లక్నో – జైపూర్‌
మార్చి 24 : గుజరాత్‌ వర్సెస్‌ ముంబై – అహ్మదాబాద్‌
మార్చి 25 : బెంగళూరు వర్సెస్‌ పంజాబ్‌ – బెంగళూరు
మార్చి 26 : చెన్నై వర్సెస్‌ గుజరాత్‌ – చెన్నై
మార్చి 27 : హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై – హైదరాబాద్‌
మార్చి 28 : రాజస్తాన్‌ వర్సెస్‌ ఢిల్లీ – జైపూర్‌
మార్చి 29 : బెంగళూరు వర్సెస్‌ కోల్‌కతా – బెంగళూరు
మార్చి 30 : లక్నో వర్సెస్‌ పంజాబ్‌ – లక్నో
మార్చి 31: గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ – అహ్మదాబాద్‌
మార్చి 31 : ఢిల్లీ వర్సెస్‌ చెన్నై – వైజాగ్‌
ఏప్రిల్‌ 01 : ముంబై వర్సెస్‌ రాజస్తాన్‌ – ముంబై
ఏప్రిల్‌ 02 : బెంగళూరు వర్సెస్‌ లక్నో – బెంగళూరు
ఏప్రిల్‌ 03 : ఢిల్లీ వర్సెస్‌ కోల్‌కతా – వైజాగ్‌
ఏప్రిల్‌ 04 : గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌ – అహ్మదాబాద్‌
ఏప్రిల్‌ 05 : హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై – హైదరాబాద్‌
ఏప్రిల్‌ 06 : రాజస్తాన్‌ వర్సెస్‌ బెంగళూరు – జైపూర్‌
ఏప్రిల్‌ 07 : ముంబై వర్సెస్‌ ఢిల్లీ – ముంబై
ఏప్రిల్‌ 07 : లక్నో వర్సెస్‌ గుజరాత్‌ – లక్నో

ఇదిలా ఉంటే రెండో షెడ్యూల్‌ను ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రకటించనున్నట్లు లీగ్ చైర్మన్ వెల్లడించారు. దీంతో మే నెలాఖరు వరకు టోర్నీ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా గత సీజన్‌లో మిస్టర్ కూల్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.