AP Govt:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల..

  • IndiaGlitz, [Friday,December 08 2023]

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.

పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. మెయిన్స్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. కొత్త సిలబస్ ఆధారంగా గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అలాగే త్వరలోనే గ్రూప్-1 పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

More News

Chiranjeevi:మెగాస్టార్ ఇంటికి విశిష్ట అతిథి.. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ, పెద్ద ప్లానే వుందా..?

హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి గురువారం విశిష్ట అతిథి విచ్చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరాండోస్ గురువారం నగరానికి వచ్చారు.

KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స..

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలు జారిపడ్డారు.

Ayyanna Patrudu: లోకేష్‌కు సొంత పార్టీలోనే తీవ్ర అవమానం.. అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు..!

తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలో యువనేత నారా లోకేష్ పెత్తనంపై సీనియర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. హోంమంత్రి ఎవరంటే..?

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు.

Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు.