‘ఎవర్‌ గివెన్’ నౌక విషయంలో గుడ్ న్యూస్..

  • IndiaGlitz, [Monday,March 29 2021]

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ నౌక ‘ఎంవీ ఎవర్‌ గివెన్ విషయంలో ఓ గుడ్ న్యూస్ తాజాగా వినవస్తోంది. సూయజ్‌ కెనాల్‌లో అనూహ్యంగా చిక్కుకుని ఈ నౌక చేసిన నష్టం అంతా ఇంతా కాదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల చొప్పున గత వారం రోజులుగా నష్టం సంభవిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊహించని పరిణామం. ఈ నౌక 2.20 లక్షల టన్నుల సామగ్రితో ప్రయాణిస్తోంది. 400 మీటర్ల పొడవున్న ఈ నౌక తూర్పు పైభాగం ప్రమాదవశాత్తు తూర్పు గోడను.. కింద భాగం పశ్చిమ గోడను తాకడంతో అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కెనాల్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ సరఫరా జరుగుతుంటుంది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న ఈ భారీనౌకను దారిలోకి తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక గుడ్‌ న్యూస్‌ ఊరటనిస్తోంది.

ఈ భారీ కంటైనర్ షిప్‌ ఇపుడు పాక్షికంగా ముందుకు కదిలింది. పాక్షికంగా నీటిపై తేలియాడుతున్నట్టు మారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇంచ్‌కేప్ వెల్లడించింది. నౌకను బయటకు తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు తవ్వుతుండగా.. టగ్ బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. అలా ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్ చేశారు. ఈ ప్రయత్నం ఫలించి పాక్షికంగా నౌక నీటిపై తేలియాడటం ప్రారంభించింది. తాజా పరిణామంతో ఈ ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందనే ఆశలు భారీగా చిగురించాయి. ఈ మేరకు ‘ఎవర్ గివెన్’ నౌక కదిలిందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ‘ఇదొక శుభవార్త’ అంటూ సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ మీడియాకు వెల్లడించారు.

కాగా ఈ షిప్‌ను ముందుకు కదిలించే ప్రయత్నాలు నిలిపివేశామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్‌సీఏ) వెల్లడించింది. తగినంత టగ్ శక్తి అమలయ్యే వరకు తదుపరి రిఫ్లోటింగ్ ప్రయత్నాన్ని సోమవారం సాయంత్రానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. అయితే న్యూస్ కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ రిచర్డ్ మీడే ఓ ఊరటనిచ్చే వార్త సైతం వెల్లడించారు. రాబోయే 24-48 గంటల్లో ఓడను తరలించే అవకాశముందని తెలిపారు. ఈ కంటైనర్ షిప్‌ను విడిపించేందుకు మరిన్ని టగ్‌బోట్లు అవసరమని ఈజిప్టు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం ఇంకా సూయజ్ కాలువలోని రాకపోకలకు అడ్డంగానే ఉంది. దీన్ని కదిలిస్తే కానీ రాకపోకలకు మార్గం సుగమం కాదు. కానీ అది ఎప్పుడు జరుగుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

More News

రోజాకు రెండు మేజర్ సర్జరీలు : వెల్లడించిన సెల్వమణి

నగరి ఎమ్మెల్యే రోజాకు సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ఆమె ఒకటి కాదు రెండు అది కూడా మేజర్ సర్జరీలు చేయించుకున్నారని ఆమె భర్త సెల్వమణి

లగ్జరీ కారు కొన్న ప్రభాస్.. దాని ధర ఎంతో తెలిస్తే...

‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యారు.

తెలంగాణ మంత్రి మిస్సింగ్.. ఎక్కడికి వెళుతున్నారనేది సస్పెన్స్!

సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రి ఒకరు తప్పిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఏంటనేది మాత్రం సస్పెన్స్.

విజయనగరంలో రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి

అతివేగంతో పాటు.. డంపింగ్ యార్డులో చెత్త తగులబెట్టడం వెరసి పెను ప్రమాదానికి కారణమయ్యాయి.

పవన్ ఫ్యాన్స్‌కి బంపరాఫర్.. ట్రైలర్ రిలీజ్ వారి చేతుల మీదుగానే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి పవన్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.