మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22).. ఈ సందర్భంగా శనివారం రోజున గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. `శ్రీదేవి శోభన్‌బాబు` అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు సంతోశ్ శోభన్, జానులో చిన్ననాటి సమంత పాత్రలో నటించి గౌరి జి.కిషన్ ..జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వీడియో ప్రోమోను గమనిస్తే .. సంతోశ్ శోభన్, గౌరి జి.కిషన్ దగ్గరగా నిలుచుకుని కళ్లు మూసుకుని ప్రేమ తన్మయత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు కనిపిస్తుంది. కలర్‌ఫుల్ లవ్‌స్టోరిగా రూపొందనున్న `శ్రీదేవి శోభన్‌బాబు`తో సుష్మిత కొణిదెలతొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
నటీనటులు: సంతోశ్ శోభన్, గౌరి జి.కిషన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com