'గోల్కొండ సింహం' బాల్‌రెడ్డి కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నమూశారు. పేగు క్యాన్సర్‌‌తో బద్దం బాధపడుతున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ నెల 10న కేర్ ఆస్పత్రిలో చేరిన బద్దం త్వరగానే కోలుకుని ఆయన మన మధ్యలో తిరుగుతారని కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ భావించారు.. అయితే ఊహించని విషాదం చోటుచేసుకుంది. బద్దం ఇకలేరని తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు కేర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

బద్దం ట్రాక్ రికార్డ్..

హైదరాబాద్‌‌లోని 1985, 1989, 1994లో కార్వాన్ నియోజకవర్గం నుంచి బద్దం గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వద్ద ట్రైనింగ్ పొందిన కొందరు ఆయనపై హత్యాయత్నం చేశారు. అయితే, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేసిన వారిలో ఆయన ముఖ్యుడని నేతలు చెప్పుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మైనారిటీ ప్రభావం ఉన్న ఏరియాలో కూడా బద్దం కాషాయజెండా ఎగరేయగలిగారంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే అభిమానులు అందరూ ఆయన్ను ‘గోల్కొండ సింహం’ అని పిలుచుకుంటారు.

More News

చిరంజీవి టైటిల్‌తో నాని?

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌ల మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా టైటిల్‌ను రేపు అనౌన్స్ చేయ‌బోతున్నారు.

మ‌రో ప్లాప్ డైరెక్ట‌ర్‌తో శర్వా

'లై' సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే హీరో శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మై.. 'ప‌డిప‌డిలేచెమ‌న‌సు' సినిమా చేశాడు. ఈ సినిమాకు డిజాస్ట‌ర్ అయ్యింది.

వెబ్‌సిరీస్ ప్లానింగ్‌లో నంద‌మూరి హీరో...

ప్రస్తుతం డిజిటల్ రంగానికి చాలా పెద్ద ఊపు ఉంది. చాలా మంది సినిమా రంగానికి చెందిన ద‌ర్శ‌కులు,

జూన్‌కి 'మ‌హ‌ర్షి'

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేష్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది.

'మహానాయకుడు': అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!

ఆంధ్రుల అన్నగారు, దివంగత ముఖ్యమంత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. దీన్ని రెండు భాగాలుగా చేసిన దర్శకుడు క్రిష్.. మొదటి భాగంలో ఆయన సినీ జీవితం