'గోల్కొండ సింహం' బాల్‌రెడ్డి కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నమూశారు. పేగు క్యాన్సర్‌తో బద్దం బాధపడుతున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ నెల 10న కేర్ ఆస్పత్రిలో చేరిన బద్దం త్వరగానే కోలుకుని ఆయన మన మధ్యలో తిరుగుతారని కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ భావించారు.. అయితే ఊహించని విషాదం చోటుచేసుకుంది. బద్దం ఇకలేరని తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు కేర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
బద్దం ట్రాక్ రికార్డ్..
హైదరాబాద్‌లోని 1985, 1989, 1994లో కార్వాన్ నియోజకవర్గం నుంచి బద్దం గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వద్ద ట్రైనింగ్ పొందిన కొందరు ఆయనపై హత్యాయత్నం చేశారు. అయితే, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేసిన వారిలో ఆయన ముఖ్యుడని నేతలు చెప్పుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మైనారిటీ ప్రభావం ఉన్న ఏరియాలో కూడా బద్దం కాషాయజెండా ఎగరేయగలిగారంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే అభిమానులు అందరూ ఆయన్ను ‘గోల్కొండ సింహం’ అని పిలుచుకుంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout