‘అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట విడుదల

  • IndiaGlitz, [Saturday,November 13 2021]

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

అర్జున ఫల్గుణ నుంచి తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. గోదారి వాళ్లే సందమామ అంటూ విడుదల చేసిన లిరికల్ వీడియోతో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. గోదావరి జిల్లాల్లో ప్రజల మనస్తత్వాలు, అక్కడి పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ పాట సాగుతుంది. చైతన్య ప్రసాద్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో శ్రీ విష్ణు అమృత అయ్యర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అమల చేబోలు, అరవింద్ ఈ పాటను ఆలపించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ మంచి బాణీని అందించారు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్యే విడుదలైన అర్జున ఫల్గుణ టీజర్‌కు విశేష స్పందన లభించింది. దీంతో సినిమా మీద అంచనాలు భారిగా పెరిగాయి.

నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: టాస్క్‌ మధ్యలో కంట్రోల్ తప్పిన షణ్ముఖ్‌-సన్నీ-సిరి... కొత్త కెప్టెన్‌గా రవి

కెప్టెన్సీ పోటీదారుల కోసం జరుగుతున్న బీబీ హోటల్ టాస్క్ ఫన్‌తో పాటు గొడవలు కూడా పెట్టింది. షణ్ముఖ్- సిరి- సన్నీ, యానీ మాస్టర్- కాజల్‌ల మధ్య గొడవ తారాస్థాయికి చేరి..

సస్పెన్స్‌కు తెర... ‘మరక్కర్‌’ థియేటర్స్‌కే వస్తున్నాడు

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్‌’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.

ప్రమోషన్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు లేవు : ‘‘ పుష్ప ’’ను పోస్ట్ పోన్ చేస్తున్నారా.. అసలేం జరుగుతోంది..?

కోవిడ్ తగ్గుముఖం  పట్టడం, థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో విడుదలకు నోచుకోని చిన్నా, పెద్దా సినిమాలు వరుసపెట్టి క్యూకడుతున్నాయి.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ కుమార్తె.. అది కూడా తెలుగులో..?

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సీనియర్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా జరిగిన 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఫంక్షన్

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ 'జీ 5'.