నాగార్జునతో గోవా బ్యూటీ..?

  • IndiaGlitz, [Saturday,June 20 2020]

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో బాలీవుడ్‌లో బ‌ర్ఫీతో స‌క్సెస్ కొట్టిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాలు ఇలియానాను వ‌రించ‌లేదు. అదే స‌మయంలో టాలీవుడ్ నుండి వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఇలియానా ప‌ట్టించుకోలేదు. మ‌రోప‌క్క ప్రేమ‌లో ప‌డ‌టం, లివిన్ రిలేష‌న్ వంటి ప‌నుల‌తో కెరీర్‌ను ప‌ట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ కూడా ఇలియానాను ప‌క్క‌న పెట్టేసింది. ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ప్ర‌య‌త్నాలు చేసింది. అదే స‌మ‌యంలో తెలుగులోనూ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంలోనూ న‌టించింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే ఇలియానా చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో ఇలియానా డిప్రెష‌న్‌కు గురైంద‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

అదే స‌మ‌యంలో జ‌గ‌న సుంద‌న‌ది ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో యాంక‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇలియానాకు టాలీవుడ్ నుండి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. నాగార్జున హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.