ఓటీటీలోకి గోవా బ్యూటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న సమయంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో బాలీవుడ్‌లో బర్ఫీతో సక్సెస్ కొట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు ఇలియానాను వరించలేదు. అదే సమయంలో టాలీవుడ్ నుండి వచ్చిన అవకాశాలను ఇలియానా పట్టించుకోలేదు. మరోపక్క ప్రేమలో పడటం, లివిన్ రిలేషన్ వంటి పనులతో కెరీర్‌ను పట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ కూడా ఇలియానాను పక్కన పెట్టేసింది. కొన్ని రోజుల క్రితం ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇలియానాను యాంకరింగ్ కోసం సంప్రదించిందని వార్తలు కూడా వినిపించాయి.
రీసెంట్‌గా పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్‌లో ఇలియానా నటించనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలియానా సినిమాకు సమాంతరంగా డెవలప్ అవుతోన్న డిజిటల్ మాధ్యమంలోనూ ఇలియానా ఎంట్రీ ఇవ్వనుందని న్యూస్ వచ్చింది. బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు మెప్పిస్తున్న డిజిటల్ మాధ్యమంలో మరి ఇలియానా నటిస్తుందా? ఒకవేళ నటిస్తే బోల్డ్ పాత్రల్లో నటిస్తుందా లేదా? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com