'సిక్స్ ప్యాక్' కావాలంటే జిమ్‌కు కాదు.. ఈ ఆస్పత్రికెళ్లండి!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటి.. సిక్స్ ఫ్యాక్ బాడీ కావాలంటే జిమ్‌కు వెళ్లి నానా వర్కవుట్స్ చేయాలి కదా.. మరి ఆస్పత్రికి వెళ్లడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే. 'పైసా మే పరమాత్మ హై' అని పెద్దలు ఓ మాట చెబుతుంటారు. అదేదో తెలుగు సినిమాలో 'డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారు అంటారు' అనే సాంగ్ ఉంది కదా. అలాగే డబ్బుంటే సిక్స్ ప్యాకే కాదు.. సెవెన్, ఎయిట్ ప్యాక్ వచ్చేస్తోందోయ్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దీనంతటికి కారణం.. మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీ. వీటితో ఎన్నో సౌలభ్యాలు మనకు అందుతున్న విషయం తెలిసిందే.
సిక్స్‌ప్యాక్ బాడీ తెచ్చుకోవాలంటే సాదారణంగా అందరూ ఏం చేస్తారు.. ఉదయం నిద్రలేచింది మొదలుకుని సాయంత్రం ఎన్నో వర్కవుట్స్ చేయాలి.. ఇలా జిమ్‌లోనే రోజంతా గడిచిపోతుంది. ఓ వైపు జిమ్‌లో వర్కవుట్స్.. మరో వైపు నోరు కట్టేసుకొని కొన్ని రోజుల పాటు నానా గడ్డీ తినకుండా ఉంటే వీలైనంత త్వరగానే సిక్స్‌ప్యాక్ సాధ్యమవుతుంది. అయితే ఇది కూడా డైలీ చేస్తేనే సరి.. లేకుంటే సిక్స్ ప్యాక్ కాదు ఫ్యామిలీ ప్యాక్ కూడా మించిపోతుంది పొట్ట. ఏ మాత్రం తేడా కొట్టినా ఆస్పత్రి పాలవ్వడమే.!
అయితే రోజూ జిమ్‌కు వెళ్లాల్సిన అక్కర్లేకుండా.. మరీ ముఖ్యంగా నోరు కట్టేసుకునే పనిలేకుండానే థాయ్‌లోని మాస్టర్ పీస్ ఆస్పత్రికి వెళితే మీరు కలలు కనే సిక్స్ ప్యాక్ బాడీని ఈజీగా పొందొచ్చు. ఇందుకు కావాల్సింది వర్కవుట్స్ కాదు.. కేవలం డబ్బులు మాత్రమేనట. ‘అబ్‌డామినల్ ఎట్చింగ్’ అనే శస్త్రచికిత్స ద్వారా ఎలాంటి వారికైనా సరే సిక్స్ ప్యాక్ తెప్పించేస్తారట. అయితే వీటిలో పొట్ట భాగంలో కండరాలు బలంగా ఉన్నవారికే ఈ ఆపరేషన్ విజయవంతమవుతుందని.. మిగిలిన వారికి చాలా వరకు డౌటేనని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ సిక్స్ ప్యాక్ అనేది ఉంటుంది కానీ కొవ్వుతో పొట్ట మొత్తం కప్పేయబడుతుంది. ఆ కొవ్వును కాస్త తొలిగిస్తే మనకు కావాల్సిన చోట సిక్స్ ప్యాక్ వచ్చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే.. ఇందులో ఎలాంటి ప్లాస్టిక్, సిలికాన్ అనేవి వాడకపోవడంతో పెద్ద ఇబ్బందులేమీ తలెత్తవని డాక్టర్లు చెబుతున్నారు. కేవలం రెండు నుంచి మూడు గంటలపాటు ఈ శస్త్ర చికిత్స జరుగుతుందట. అయితే ఈ ఆపరేషన్‌తో ఎలాంటి ప్రమాదం కానీ.. ముఖ్యంగా నొప్పి అనేది రాదంట. గత మూడేళ్లుగా థాయ్‌లాండ్‌లోని ఈ ఆస్పత్రిలో చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రతీ ఏడాదీ 30 మంది యువకులు సిక్స్ ప్యాక్ కోసం వచ్చి ఆపరేషన్ చేయించుకుంటున్నారని ఆస్పత్రి సీఈవో రావీపూట్ మీడియాకు వివరించారు. ఇలా ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న పలువురు యువకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీంతో పాటు వారు సర్జరీ చేయించుకున్న సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఫొటోలను యువకులు పోస్ట్ చేశారు.
మొత్తానికి చూస్తే.. సిక్స్ ప్యాక్ కావాలంటే జిమ్‌లకెళ్లి భగీరథ ప్రయత్నాలు చేయనక్కర్లేదన్న మాట. నాలుగు పైసలుంటే థాయ్‌లాండ్‌కెళ్లి సిక్స్ ప్యాక్‌తో ఇంటికి రావచ్చన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout