హీరోయిన్ల పై నిర్మాత భార్య సంచలన వ్యాఖ్యలు...
- IndiaGlitz, [Wednesday,March 21 2018]
తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా భార్య నేహా నేడు హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చని సంసారాలను హీరోయిన్లు కూల్చేస్తున్నారని.. వారిని వేశ్యలతో పోల్చుతూ తిట్టారు. అదే సందర్భంలో తాను కొందరి హీరోయిన్లన దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశానని చెప్పడం గమనార్హం.
ఈ విషయాన్ని నేహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాను ఆ హీరోయిన్ల పేర్లు బయట పెడతానని కూడా తెలిపారు. కొంత సేపటికి తన ట్వీట్స్‌ను డిలీట్ చేసిన నేహా.. తనకు, తన భర్తకు ఎలాంటి గొడవలు లేవని.. కొందరు పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లో కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు.
దాని కారణంగా భార్య భర్తల మధ్య అంతరాలేర్పడుతున్నాయని నేహ తెలిపారు. నా చుట్టు జరుగుతున్న విషయాలపై నేను స్పందిస్తున్నాను కాబట్టి దయచేసి బాధ్యతగా మద్ధతు తెలపండి అంటూ పోస్ట్ చేశారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్లనుందో మరి!