భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించేది జీఎంఆరే..
- IndiaGlitz, [Monday,February 25 2019]
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి గాను జీఎంఆర్, జీవీకేతో డోయిట్ ఆర్బన్ ఇన్ఫ్రాతో పాటు పలు సంస్థలు పోటాపోటీగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు(ఆర్ఎఫ్పీ) దాఖలు చేయడం జరిగింది. అయితే వీటిని నిశితంగా పరిశీలించిన అధికారులు.. ఈ మూడు సంస్థలు సమర్పించిన ఆర్థిక బిడ్లు తెరిచేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించాయి. ఈ భారీ నిర్మాణం జరిపేందుకుగాను మొత్తం ఏడు ప్రతిపాదనలను దాఖలు చేసి ఫైనల్గా జీఎంఆర్కు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సదురు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శుభవార్త విన్న జీఎంఆర్ గ్రూప్ పెద్దలు, బోర్డ్ మెంబర్లు స్వీట్లు పంచుకున్నారు.
అయితే ఈ జీఎంఆర్నే ఎందుకు ఎన్నకున్నది..? జీవీకేకు ఎందుకు ఇవ్వలేదు? పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..? అనే అనే విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే పలు భారీ ఎయిర్పోర్టులను జీఎంఆర్ నిర్మించి తన సత్తా ఏంటో చాటుకుంది. అందుకే ఆ కంపెనీకే మళ్లీ పగ్గాలిచ్చినట్లుగా స్పష్టమవుతోంది.