Ram Charan:మరో గుర్రాన్ని కొనుగోలు చేసిన చరణ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ పోస్ట్, బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ స్టార్ స్టైలిష్ లుక్

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సినిమాలు, వ్యాపారాలతో పాటు జంతువులతో గడపడం చాలా ఇష్టం . అలాగే ఆయనకు గుర్రాలపై స్వారీ అంటే కూడా మక్కువ. ఈ విషయాన్ని చరణ్ ఎన్నోసార్లు ప్రస్తావించారు. చిన్న వయసులోనే గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు. నాటి నుంచి గుర్రాల పెంపకంపై చరణ్‌కు ఇంకా ఇష్టం పెరిగింది. అలాగే ఆయనకు పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ కూడా వుంది. తాజాగా ఆయన తన కొత్త గుర్రం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బ్లేజ్ తన కొత్త స్నేహితుడు ’’ అంటూ గుర్రంతో దిగిన ఫోటోను చరణ్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో బ్లాక్ టీషర్ట్, సన్ గ్లాసెస్ ధరించి స్టైలీష్ లుక్‌‌లో అదిరిపోతున్నారు గ్లోబల్ స్టార్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రావాల్సి వుంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్, సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ కలిసి తెరకెక్కిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ ఆఫీస్ ఓపెనింగ్, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More News

Minister Roja:కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా.. మీ ఇంట్లో ఆడవాళ్లకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా..?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు.

Chiranjeevi : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్ .. అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు..!!

ఆసక్తికరమైన కథలకు, పంచ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు త్రివిక్రమ్. ఆయన కలం నుంచి వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి.

Nobel Prizes:భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరంచిన నోబెల్ బహుమతులు

2023 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

Narendra Modi:కేసీఆర్‌ నన్ను కలిశారు.. నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ..

Chandra Babu:సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ 9వ తేదికి వాయిదా

స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.