Ram Charan-Upasana: 'ఫోర్బ్స్' మ్యాగజైన్‌పై స్టైలీష్‌గా చరణ్, ఉపాసన - టాలీవుడ్ నుంచి ఫస్ట్ కపుల్‌గా ఘనత
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి కెరీర్‌లో ఎన్నో ఘనతలు అందుకున్నారు రాంచరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి ఎదిగింది. నాటు నాటు సాంగ్ హిట్ కావడం, దానికి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ రావడంతో హాలీవుడ్‌లోనూ చెర్రీ పేరు మారుమోగిపోయింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరైన్ సహా దిగ్గజ దర్శకులు సైతం చరణ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. నిన్న గాక మొన్న అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లెక్సీ సీఈవో చరణ్ ఇంటికి స్వయంగా రావడం విశేషం. అలాగే గ్లోబల్ స్టార్‌కి ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ బ్రాంచ్‌లో స్థానం సంపాదించుకున్నారు. అకాడమీ నుంచి గత నెలలో లేటెస్ట్‌గా విడుదలైన యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టులో చరణ్ పేరు ప్రకటించారు.
తాజాగా రామ్‌చరణ్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో చరణ్‌కు ‘‘ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డ్’’ దక్కింది . ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ పురస్కారం కోసం షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొణే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా తదితరులు పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కినెట్టి రామ్‌చరణ్ గోల్డెన్ బాలీవుడ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజాగా చరణ్ దంపతులు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ స్టార్ కపుల్ దర్శనమిచ్చారు. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ జంట కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. ఈ ఫోటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెస్సుల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా వున్నారు. ఉపాసన సోఫాలో కూర్చొని వుండగా.. ఆమె ఒడిలో చెయ్యి పెట్టి చరణ్ నేలపై కూర్చొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్‌ఫుల్ కపుల్ అంటూ ఫోర్బ్స్ ఇండియా ఈ ఫీచర్‌ను ప్రచురించింది. మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం , క్లీంకార వచ్చాక జరిగిన మార్పులను వారు పంచుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments