Ram Charan:క్లీంకారాతో కలిసి మహాలక్ష్మీ ఆలయంలో చరణ్ - ఉపాసన ప్రత్యేక పూజలు .. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనా దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి మెగా ఫ్యామిలీ ‘‘క్లీంకారా’’గా నామకరణం చేసింది. పాప పుట్టిన వేళా విశేషం బాగుందని ఆమె వచ్చాక తమకు అన్ని సక్సెస్‌లే వస్తున్నాయని మెగా ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంటోంది. చిన్నారితో కలిసి ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న చరణ్ దంపతులు తాజాగా పాపతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్లీంకారాకు ఆరు నెలలు నిండటంతో ఆమెను తీసుకుని రాంచరణ్ - ఉపాసన దంపతులు ముంబైలోని మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ తమ కుమార్తె పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో చరణ్ , దంపతుల ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిని చూసేందుకు , సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటెత్తారు.
కాగా.. రామ్‌చరణ్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో చరణ్‌కు ‘‘ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డ్’’ దక్కింది . ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ అవార్డ్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ పురస్కారం కోసం షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొణే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా తదితరులు పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కినెట్టి రామ్‌చరణ్ గోల్డెన్ బాలీవుడ్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే .. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com