Globalstar Ram Charan:పాప పుట్టిన క్షణం ఒత్తిడి మరిచిపోయాం : క్లీంకార ఆగమనంపై చరణ్ వీడియో, చెంచుల బిడ్డగా పెంచుతామన్న చెర్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పేరెంట్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన. దీంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, సన్నిహితులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ చిన్నారికి ‘‘క్లీంకార కొణిదెల’’గా నామకరణం చేశారు చరణ్ దంపతులు. ఈ చిన్నారి జన్మించి నెల రోజులు కావడంతో పాటు ఉపాసన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తమ కుమార్తె పుట్టి నెల రోజులు పూర్తి కావొస్తోందని చెప్పిన ఆయన.. ఈ 11 ఏళ్లలో తమ వైవాహిక జీవితంలో ఉపాసన ఎన్నో త్యాగాలు చేసిందంటూ ప్రశంసించారు. తమ ప్రేమకు గుర్తుగా క్లీంకార తమ జీవితంలోకి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు ఎలా ఫీలయ్యారు వంటి విషయాలను చెర్రీ పంచుకున్నారు.
పిల్లలు పుట్టకపోవడంతో ఒత్తిడి ఫీలయ్యాం :
పెళ్లయి 11 ఏళ్లు కావొస్తున్నా పిల్లలు లేకపోవడంతో తాము ఎంతో ఒత్తిడికి గురయ్యామని.. జరగాల్సిన సమయంలోనే జరుగుతుందని తాము నమ్మామని చరణ్ చెప్పారు. సరైన సమయంలోనే క్లీంకార తమ జీవితాల్లోకి అడుగుపెట్టిందని.. పాపను అందుకున్న ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించిందంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. పాప పుట్టడానికి పట్టిన 9 నెలల సమయం, ఆ సమయంలో జరిగినదంతా తలచుకుని సంతోషంగా ఫీలయ్యామని చరణ్ అన్నారు. అంతేకాదు.. తమ పాపను చెంచుల పాపగా పెంచుతామని సంచలన ప్రకటన చేశారు.
క్లీంకార ముందు వెనుక ట్యాగులొద్దు : ఉపాసన
ఉపాసన కూడా ఇదే విషయాన్ని తెలిపారు. తమ పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను.. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వొద్దని కోరారు. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలన్నది తన అభిప్రాయమని... పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవన్నారు. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని.. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని తాను భావిస్తానని ఉపాసన అన్నారు.
మెగా కుటుంబానికి మోస్ట్ మెమొరబుల్ వీడియోగా వున్న ఇందులో చరణ్, ఉపాసనలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, ఉపాసన తల్లిదండ్రులు శోభా కామినేని, అనిల్ కామినేని తదితర కుటుంబ సభ్యులు వున్నారు. క్లీంకార పుట్టిన తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకోవడాన్ని ఈ వీడియోలో చాలా అందంగా చూపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout