Globalstar Ram Charan:శెభాష్ : మండు వేసవిలో దాహార్తిని తీరుస్తున్న రామ్ చరణ్ అభిమానులు.. ఇది కదా నిజమైన సేవ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. అంతేకాదు ... సామాజిక సేవలోనూ చిరంజీవికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో తన కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ వస్తున్న ఆయన.. మెగా పవర్ స్టార్‌గా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఇంతకంటే ఒక తండ్రికి పుత్రోత్సాహం ఏముంటుంది. కొడుకును చూసి తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతానని పలుమార్లు వేదికలపై చెప్పారు చిరు.
తండ్రి నుంచి సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్న చరణ్ :
చిత్ర పరిశ్రమలో నటుడిగా నిరూపించుకున్న ఆయన.. తండ్రి నుంచి సేవాభావాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందించారు. ఇంకా అందిస్తూనే వున్నారు. వీటన్నింటిని ప్రత్యక్షంగా గమనిస్తున్న చరణ్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో మాదిరిగానే సమాజానికి ఇతోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.
మహారాష్ట్రలో వేలాది మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ :
దీనిలో భాగంగానే వారు కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ .. ఆపదలో వున్న వారిని ఆదుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకోవడంతో జనం వేసవి తాపంతో అల్లాడుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు గడప దాటాలంటే వణికిపోతున్నారు. అయినప్పటికీ వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారికి దాహార్తిని తీర్చేందుకు గాను ముంబై అంధేరి , భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. అలాగే ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్ 29న షోలాపూర్‌లోనూ మజ్జిగ పంపిణీ , అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్ పెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు చరణ్ ఫ్యాన్స్. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము కూడా స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments