Globalstar Ram Charan:శెభాష్ : మండు వేసవిలో దాహార్తిని తీరుస్తున్న రామ్ చరణ్ అభిమానులు.. ఇది కదా నిజమైన సేవ..!!

  • IndiaGlitz, [Monday,May 15 2023]

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఫైట్లు, డ్యాన్స్, నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్. అంతేకాదు ... సామాజిక సేవలోనూ చిరంజీవికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. తండ్రి అడుగుజాడల్లో తన కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటూ వస్తున్న ఆయన.. మెగా పవర్ ‌స్టార్‌గా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఇంతకంటే ఒక తండ్రికి పుత్రోత్సాహం ఏముంటుంది. కొడుకును చూసి తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతానని పలుమార్లు వేదికలపై చెప్పారు చిరు.

తండ్రి నుంచి సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్న చరణ్ :

చిత్ర పరిశ్రమలో నటుడిగా నిరూపించుకున్న ఆయన.. తండ్రి నుంచి సేవాభావాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్‌ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందించారు. ఇంకా అందిస్తూనే వున్నారు. వీటన్నింటిని ప్రత్యక్షంగా గమనిస్తున్న చరణ్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో మాదిరిగానే సమాజానికి ఇతోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.

మహారాష్ట్రలో వేలాది మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ :

దీనిలో భాగంగానే వారు కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ .. ఆపదలో వున్న వారిని ఆదుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకోవడంతో జనం వేసవి తాపంతో అల్లాడుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు గడప దాటాలంటే వణికిపోతున్నారు. అయినప్పటికీ వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారికి దాహార్తిని తీర్చేందుకు గాను ముంబై అంధేరి , భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. అలాగే ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్‌ 29న షోలాపూర్‌లోనూ మజ్జిగ పంపిణీ , అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్‌ పెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు చరణ్ ఫ్యాన్స్. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము కూడా స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.

More News

Boyapati Rapo: ఇంకేంటి దాటేది బొంగులో లిమిట్స్ .. ఊరనాటు లుక్‌, మాస్ డైలాగ్స్‌తో దుమ్మురేపిన రామ్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tirupati MP Gurumurthy:మాతంగి గెటప్‌లో వైసీపీ ఎంపీ : బన్నీని దింపేశాడుగా .. ఇది పుష్పగాడి రూల్ అంటోన్న ఫ్యాన్స్, ఫోటోలు వైరల్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు

Sudipto Sen:'ది కేరళ స్టోరీ' దర్శకుడు , హీరోయిన్‌ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు

దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలరం రేపిన సినిమా ‘‘ ది కేరళ స్టోరీ’’.

Prabhas : మరోసారి పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. భద్రాద్రి రామయ్యకు భారీ విరాళం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.

Venky Atluri:టాలీవుడ్‌లో సెన్సేషనల్ : వెంకీ అట్లూరితో దుల్కర్ సల్మాన్.. ఈసారి అంతకుమించి..!!

దుల్కర్ సల్మాన్.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. తన మాతృభాషలో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రభంజనం కారణంగా