Ram Charan:విజయ్ దేవరకొండ బర్త్ డే.. నీ ఫ్యాన్స్‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాలంటూ చరణ్ ట్వీట్, ఎందుకంటే..?
- IndiaGlitz, [Tuesday,May 09 2023]
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య తొలి నుంచి సుహృద్భావ సంబంధాలే వుండేవి. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు తోటి హీరోలతో వీరంతా సన్నిహితంగానే మెలుగుతున్నారు. వృత్తి రీత్యా పోటీ వున్నప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం అంతా మంచి ఫ్రెండ్స్. ఒకరి ఇంట్లో శుభకార్యాలకు మరొకరు వెళ్లడంతో పాటు కష్ట సుఖాల్లో తోడుగా వుంటున్నారు. ఇక ఒకరి పుట్టినరోజుల సందర్భంగా మరొకరు విషెస్ తెలియజేసుకుంటున్నారు.
రక్తదానం చేస్తోన్న విజయ్ అభిమానులు :
తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసిన ఆయన.. విజయ్‌కు విషెస్ చెప్పడంతో పాటు అతని అభిమానులు చేసిన పనిని మెచ్చుకున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా విజయ్ అభిమానులు హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన చెర్రీ.. నీ ఫ్యాన్స్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే చరణ్ ట్వీట్‌కు స్పందించారు విజయ్ దేవరకొండ. చరణ్‌కు థ్యాంక్యూ అన్న అంటూ రిప్లయ్ ఇచ్చారు. తన అభిమానులు తనను ఎల్లప్పుడూ గర్వపడేలా, సంతోషంగా వుండేలా చేస్తారని విజయ్ కొనియాడారు. మీరు చేసిన కామెంట్స్ వారు వింటే ఎంతో సంతోషిస్తారని విజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండకు శుభాకాంక్షల వెల్లువ:
ఇకపోతే.. రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండకు పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. మంచు లక్ష్మీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్, సుధాకర్ కోమాకుల, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, దర్శకుడు రాధాకృష్ణ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ.. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీల్లో ‘‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’’ పేరిట అందరికీ ఉచితంగా ఐస్ క్రీములు పంచుతున్నారు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘ఖుషి’ సినిమా నుంచి ‘నా రోజా నువ్వే’ అనే అందమైన మెలోడిని విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ పక్కన సమంత హీరోయిన్గా నటిస్తున్నారు.
Happy Birthday @TheDeverakonda
— Ram Charan (@AlwaysRamCharan) May 9, 2023
Really appreciate your fans who have donated blood at The Chiranjeevi Blood bank on this occasion.