'గ్లామ‌ర్ గ‌ర్ల్స్' ప్రారంభం

  • IndiaGlitz, [Friday,April 13 2018]

విక్ట‌రీ మూవీస్ ప‌తాకంపై గుల్ మ‌హ్మ‌ద్, అక్బ‌ర్, స‌లీమ్,  జి. శంక‌ర్ గౌడ్ తెలుగు, హీందీ భాష‌ల్లో  నిర్మిస్తోన్న 'గ్లామ‌ర్ గ‌ర్ల్స్‌' చిత్రం గురువారం హైద‌రాబాద్ ఫిలి ఛాంబ‌ర్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత చద‌ల‌వాడ శ్రీనివాస‌రావు క్లాప్ ఇచ్చారు.  కెమెరా స్విచ్ఛాన్, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం ఎన్. శంక‌ర్ వ‌హించారు. గెహనా వ‌శీష్ట‌, షీలా క‌పూర్, అర్చా శ్రీవాస్త‌వ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్న ఈ చిత్రానికి హృద‌య్ శంక‌ర్ మిశ్రా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ' యజ్ఞం, వ‌ర్షం, పౌర్ణ‌మి, ల‌క్ష్మి న‌ర‌సింహా చిత్రాల‌కు  ప‌నిచేశాను. 12 భాష‌ల్లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. తొలిసారి తెలుగు సినిమా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఆనందంగా ఉంది. నాకు తెలుగు సినిమా అండ‌గా ఉంటుంద‌ని ఆశిస్తున్నా. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే 'ప్ర‌తీ యువ‌తి అందంగా ఉన్నాన‌ని క‌ల‌లు కంటుంది. త‌నకు అంద‌మైన ముఖం ఉంద‌ని అనుకుంటుంది. ఇది ఒక అమ్మాయి క‌థ కాదు. అంద‌మైన క‌ల‌లు క‌నే ప్ర‌తీ అమ్మాయి క‌థే ఈ సినిమా'. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. నా మిత్రుడు శంక‌ర్ గౌడ్ స‌హ‌కారంతోనే సినిమా చేస్తున్నాను' అన్నారు.

చిత్ర నిర్మాత శంక‌ర్ గౌడ్ మాట్లాడుతూ, 'న‌ల‌భై సంవ‌త్స‌రాల నుంచి ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. వివిధ శాఖ‌ల్లో ప‌నిచేశాను. తొలిసారి ఓ మంచి సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నాను.  చ‌క్క‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అంద‌రూ నాకు స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.

మ‌రో నిర్మాత గుల్ మ‌హ్మ‌ద్ మాట్లాడుతూ, ' మంచి విలువ‌లున్న ద‌ర్శ‌కుడు దొరికారు. ప‌లు భాష‌ల్లో ఆయ‌న చేసిన  చిత్రాల‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా తీస్తార‌ని భావిస్తున్నాను. మంచి టీమ్ దొరికింది. అలాగే అంద‌ర్నీ మెప్పించ క‌థ కూడా ఇది. చ‌క్క‌ని మాట‌లు కుదిరాయి.  ఈ సినిమా నిర్మిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది'అని అన్నారు.

ఎన్. శంక‌ర్ మాట్లాడుతూ, ' శంక‌ర్ గౌడ్ ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం. చాలా కాలం నుంచి ఇండ‌స్ర్టీలో ఉన్నారు. ఈ గ్లామ‌ర్ గాళ్స్ ఆయ‌న కెరీర్ ను ట‌ర్న్ చేస్తుంద‌ని అనుకుంటున్నా' అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, జ్ఞానేష్ శ్రీవాస్త‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

ఏప్రిల్ 14న 'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మ‌హాన‌టి'.  వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.

శ్రీరెడ్డి పై 'మా' నిషేధం ఎత్తివేత‌... లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, `మా`

విష్ణుకి ఈ సారి కూడా క‌లిసొస్తుందా?

క‌థానాయ‌కుడిగా మంచు విష్ణు కెరీర్ మొద‌లై 15 ఏళ్ళు పూర్త‌వుతోంది.

నెల‌కో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌..

తొలి చిత్రంతో సినీ పరిశ్రమలో విజయం అందుకోవడం దర్శకులకి ఎంత ముఖ్యమో..

పూరీ.. ప‌దేళ్ళ త‌రువాత‌

పూరీ జగ‌న్నాథ్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని ద‌ర్శ‌కుడి పేరిది. ఎన్నో సంచ‌ల‌న విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ ద‌ర్శ‌కుడు..