‘ఆయనకు.. ఉత్తమ కామాంధుడు అనే అవార్డు ఇవ్వండి’

సమాజం కోసం.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించినా.. అలాంటి సినిమాల్లో హైలైట్‌గా నిలిచిన నటీనటులకు, భాషకు చేసిన సేవకు గాను, దర్శకులకు ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల అవార్డులతో సత్కరిస్తాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సత్కరించనుంది. ఈ క్రమంలో తనను లైంగికంగా వేధించాడని ఒకానొక సందర్భంలో సంచలన ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందించింది.

ఉత్తమ కామాంధుడు!
ఒకరు కాదు ఇద్దరు కాదు తొమ్మిది మంది మహిళల చేత ఆరోపణలు ఎదుర్కొన్న వైరాముత్తును రక్షణ శాఖ మంత్రి గౌరవ డిగ్రీతో సత్కరించనుంది ఈ విషయాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఏమీ కాదు కానీ.. ఆరోపణలు చేసిన వారికి మాత్రం పని లేకుండా.. అసలు దొరక్కుండానే చేస్తున్నారని ఒకింత ఆవేదన వ్యక్తం చేసింది. వైరముత్తుకు తమిళ భాష పట్ల ఉన్న పట్టును గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నారు సంతోషమే కానీ.. అదే విధంగా ‘ఉత్తమ కామాంధుడు’ అనే పురస్కారం కూడా కేంద్రం ఇస్తుందని ఆశిస్తున్నని చిన్నయి చెప్పుకొచ్చింది.

ఎప్పట్నుంచో చెబుతున్నా..!
ఇదిలా ఉంటే.. తమిళ భాషకు ఆయన చేసిన సేవను గౌరవిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్.. వైరముత్తును సత్కరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై పై విధంగా ట్విట్టర్ వేదికగా చిన్మయి స్పందించింది. ఈ సందర్భంగా.. తాను చేసిన లైంగిక ఆరోపణలను మరోసారి సమాజానికి తెలియజేస్తూ.. ఏడాది నుంచి తాను చేస్తున్న ఆరోపణలపై కనీసం విచారణ కూడా జరపకపోగా.. వైరముత్తుకు మాత్రం మల్టీస్టారర్ సినిమాల్లో అవకాశాలు ఇస్తుండటం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది. కాగా అప్పట్లో.. లైంగిక ఆరోపణలు చేసిన బాధితులపైనే వేటు పడింది. ఎవర్నుంచి సపోర్టు రాకపోవడం.. తనకూ అవకాశాలు లేకుండా చేయడంతో ఇలాంటి కామాంధులను పైనున్న ఆ భగవంతుడే శిక్షిస్తాడని చిన్మయి మిన్నకుండిపోయారు. కాగా ఇటీవల కేంద్రం నుంచి ప్రకటన రావడంతో పై విధంగా చిన్మయి తీవ్రంగా స్పందించింది. అయితే ఈ వ్యాఖ్యలపై వైరముత్తు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరి.

More News

'మత్తువదలరా'ను అందరూ ఆదరిస్తున్నారు! - రితేష్‌రానా

మత్తువదలరా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు రితేష్‌రానా.పరిమిత వ్యయంతో , నవ్యమైన కథ, కథనాలతో

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం అదే పేరుతో ‘దిశ చట్టం’ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇంత రాద్ధాంతమా.. రైతులకు న్యాయం చేస్తాం: ఆర్కే

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన పెను సంచలనమైంది.

'లైఫ్ స్టైల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఇలాంటి కథలు తెరమీద చూసి చాలా కాలం అవుతుంది... హీరో శ్రీరామ్ నిమ్మల

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.