తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి...
- IndiaGlitz, [Thursday,April 18 2019]
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కాగా.. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ 59.8 శాతం, సెకండియర్ 65 శాతం మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
కాగా.. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 76 శాతంతో మేడ్చల్ మొదటి స్థానంలో నిలవగా.. కేవలం 16 శాతంతో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఇక మొదటి సంవత్సరంలో మేడ్చల్ 76%తో మొదటి స్థానంలో నిలవగా, 29%తో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను రేపు విడుదల కానుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీగా అధికారులు నిర్ణయించారు. కాగా ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే.