విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. చివరికిలా..!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. సినిమా ప్లాప్‌లు, హిట్స్ అనే తేడా లేకుండా తనకంటూ ఓ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న విజయ్.. అలా ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ఆయన క్రేజ్‌ను వాడుకోవాలని చూసిన ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. హీరో పేరుతో ఫేస్బుక్లో ఖాతా సృష్టించి అమ్మాయిలతో చాటింగ్, సహజీవనం అంటూ చేస్తూ మోసాలకు పాల్పడుండేవాడు. ఈ విషయం తన దృష్టికి రావడంతో.. తనకు చెడ్డపేరు వస్తుందని భావించి అతడి మోసాన్ని మోసంతోనే కట్టడి చేయడానికి రంగంలోకి దిగాడు.
ఈ క్రమంలో తన సహాయకుడితో (పీఏ) అమ్మాయిలా ఆ మోసగాడితో చాటింగ్ చేయించాడు. దీంతో మోసగాడు చేస్తోన్న బాగోతం బట్టబయలైంది. ఇవాళ విజయ్.. సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. నకిలీ ఫేస్బుక్ ఖాతాతో ఓ యువకుడు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్‌లో కూడా ఆ మోసగాడు చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments