బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

  • IndiaGlitz, [Wednesday,July 08 2020]

ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జులై 1వ తేదీ నుంచి ఆ బాలిక కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గాలించి 22 ఏళ్ల ప్రధాని నిందితుడిని, అతడి స్నేహితులు నలుగురిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు.

ఈ కేసు విషయమై పోలీసులు మాట్లాడుతూ.. బాధిత బాలిక నిందితుడితో ఫేస్‌బుక్‌లో టచ్‌‌లో ఉండేదని తెలిపారు. తామంతా టీమ్స్‌గా విడిపోయి రాజస్థాన్‌లోని జల్వాద్, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ తదితర ప్రాంతాల్లో గాలించి నిందితులను పట్టుకుని బాలికను రక్షించామని తెలిపారు. బాలికను రాజస్థాన్ తరలించేందుకు ప్రధాన నిందితుడు తన స్నేహితుల సాయం తీసుకున్నాడని వెల్లడించారు. కాగా ప్రధాన నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు.

More News

హరీషన్న స్పందించి యశోదాలో బెడ్ ఇప్పించారు: జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి

మంత్రి హరీష్‌రావును ప్రజల మనిషి అని అంతా భావిస్తుంటారు. ఎన్నో సందర్భాల్లో ఆయన చూపిన శ్రద్ధ, చొరవ ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది.

నేను అందుకే ఐసోలేషన్‌లో ఉన్నా: యాంకర్ ఝాన్సీ

పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడటంతో ఇతర నటీనటులకు, యాక్టర్స్‌కూ కరోనా ఉందంటూ రూమర్స్ పెరిగిపోతున్నాయి.

డిజిట‌ల్ మీడియంలోకి త్రిష‌..!!

డిజిట‌ల్ మాధ్య‌మానికి ఆడియెన్స్ నుండి ఆద‌ర‌ణ క్ర‌మంగా పెర‌గుతుంది. వెండితెర‌తో పాటు ఓటీటీ కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న టాప్‌స్టార్స్‌,

2021కి 25 కోట్ల మందికి కరోనా.. 18 లక్షల మరణాలు: ఎంఐటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి పది లక్షల మంది కరోనా బారిన పడగా..