Margadarsi:మార్గదర్శిలో ‘‘ఘోస్ట్ చందాదారుల’’ మాయాజాలం : కాగితాలపై వుంటారు, పైసా కట్టరు.. రామోజీ దొరికిపోయారుగా

  • IndiaGlitz, [Monday,August 21 2023]

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సారథ్యంలోని మార్గదర్శ చిట్స్‌ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. దశాబ్ధాలుగా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ.. ప్రభుత్వ పెద్దల అండదండలతో చిట్ ఫండ్ వ్యాపారం నడిపిన రామోజీరావు ఇప్పుడు ఏపీ సీఐడీకి దొరికిపోయారు. సీఐడీ దాడులు తనకు కొత్త కాదని.. వాటిని తాను ఎలాగైనా ఎదుర్కోగలనన్న ధీమాతో వున్న రామోజీరావుకు తాజా పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్గదర్శిలో బయటపడుతున్న ఒక్కొక్క అక్రమాన్ని సీఐడీ అధికారులు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు.

నకిలీ పేర్లతో చందాదారులు :

అంతేనా ఈ వ్యాపారంలో రామోజీ చేసిన మోసాలు, మాయలు చూసి ఏకంగా దర్యాప్తు అధికారులే నోరెళ్లబెడుతున్నారు. చిట్ సభ్యులే లేకుండా డూప్లికేట్, నకిలీ పేర్లతో చందాదారులను చేర్చడం, వారి పేరు మీద చిట్ పాడేసి ఆ డబ్బును ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేస్తున్న దందా బయటపడింది. అవసరాల్లో అక్కరకు వస్తుందని లక్షలాది మంది ప్రజలు చిట్టిలు కట్టి.. పాట పాడుకుంటే వారికి సవాలక్ష కండీషన్లు పెట్టి వేధించడం, ఏళ్ల పాటు తిప్పడం మార్గదర్శికి అలవాటుగా మారింది. చిట్ నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేయడం, అక్రమ డిపాజిట్లు సేకరించడం, ఆ సొమ్మును దొడ్డిదారిన ఇతరత్రా వ్యాపారాల్లోకి మళ్లించడం .. అబ్బో మార్గదర్శి దందాలు బోలెడు.

ఘోస్ట్ చందాదారులతో జేబులు నింపుకుంటున్న మార్గదర్శి:

ఇదిలావుండగా.. మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ అధికారులు చేసిన తనిఖీల్లో ఎన్నో అంశాలు వెలుగులోకి రాగా వీటిలోకి ‘‘ఘోస్ట్ చందాదారులు’’ అనేది అత్యంత కీలకమైనది. అంటే ఒక వ్యక్తికి తెలియకుండా అతని పేరుతోనే మార్గదర్శి చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిని చేస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల చిట్టీ గ్రూపులో 20 మంది సభ్యులుంటే ఘోస్ట్ చందాదారులుగా కొందరిని మార్గదర్శి ప్రతినిధులే దగ్గరుండి చేరుస్తారు. అంతేకాదు.. వీరు ప్రతి నెలా చిట్టీ సొమ్ము చెల్లించకపోయినా మార్గదర్శి రికార్డుల్లో మాత్రం చెల్లించినట్లుగానే వుంటుంది. చివరికి వారి పేరుతోనే మార్గదర్శి సిబ్బందే చిట్టీపాడి, ఆ సొమ్మును కంపెనీ ఖాతాలోనే జమచేస్తారు. సొమ్ము చెల్లించేవారు లేకపోయినా ఘోస్ట్ చందాదారులను అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్మును మార్గదర్శి ఎలా దోచుకుంటుందో చూశారుగా.

ఈ సుబ్రహ్మణ్యం కథ చూస్తే మార్గదర్శి మిస్టరీ అర్ధమవుతుంది :

ఈ మార్గదర్శి మాయలో పడిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కథ ప్రజలు తెలుసుకోవాలి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఈయనకు తాను అసలు మార్గదర్శిలో చందాదారుడిగా వున్నట్లే తెలియదు. ఆయన చందా చెల్లించరు, కానీ ఆయనను మార్గదర్శి చందాదారుగా చూపి.. చిట్టి సొమ్ము చెల్లిస్తున్నట్లుగానే రికార్డుల్లో చూపిస్తుంది. చందాదారునికి వచ్చే డివిడెండ్‌ను కూడా సుబ్రహ్మణ్యం పేరుతో మార్గదర్శియే తీసుకుంటుంది. ఈ క్రమంలో ఏదో ఒక నెలలో సుబ్రహ్మణ్యం చిట్టి పాడతాడు.. ఈ మొత్తాన్ని మార్గదర్శి తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది.

మీడియాపై దాడి అంటూ గగ్గోలు :

రూపాయి కూడా చెల్లించకుండానే డివిడెండ్, చిట్టి సొమ్మును మార్గదర్శి తన జేబులో వేసేసుకుంటుంది. తరచి చూస్తే ఇలాంటి అక్రమాలు మార్గదర్శి ప్రస్థానంలో ఎన్నో. వీటిని ఒక్కొక్కటిగా బయటకు లాగుతుంటే.. రామోజీ మాత్రం మీడియాపై దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ ఏదో ఒక రోజున అసలు నిజం ప్రజలకు తెలియకపోదు. ఆ రోజున జనమే రామోజీకి, ఆయన వెనుకున్న వారికి బుద్ధి చెప్పకమానరు.

More News

KCR: నేడే విడుదల : కాసేపట్లో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్, ఆశావహుల్లో టెన్షన్.. కేసీఆర్ చల్లని చూపు ఎవరి మీదో..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు జోరు పెంచాయి.

Ramanna Youth: 'రామన్న యూత్' రిలీజ్ డేట్ లాక్.. డా.జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా పోస్టర్ విడుదల

ఓ బేబీ సక్సెస్‌తో టాలీవుడ్‌లో చిన్న సినిమాలు జోరు చూపిస్తున్నాయి. కథ, కథనం బాగుంటే స్టార్ క్యాస్టింగ్‌తో పని లేకుండా జనం ఆదరిస్తారని తేలింది.

ఎన్నిక ఏదైనా రిజల్ట్ ఒకటే: ‘‘పంచాయతీ’’లో వైసీపీ జయభేరి, టీడీపీకి షాక్.. చంద్రబాబు ఇలాఖాలోనూ పరాభవం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉప ఎన్నిక జరిగినా.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక, నగరపాలక ఎన్నికలు .. ఇలా ఏది చూసుకున్న జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.

అడుగు దూరంలో ఢమాల్.. చంద్రునిపై కుప్పకూలిన రష్యా ల్యాండర్, రేసులో చంద్రయాన్ 3

దాదాపు 47 ఏళ్ల తర్వాత.. అది కూడా భారత్ చంద్రయాన్ 3 ప్రయోగించిన సమయంలోనే రష్యా నింగిలోకి పంపిన లూనా 25 ల్యాండర్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్

పాడేరు ఘాట్‌లో ఘోర ప్రమాదం : 100 అడుగుల లోయలో పడ్డ ఆర్డీసీ బస్సు, అందులో 50 మంది ప్రయాణీకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు 100 అడుగుల లోయలో పడిన ఘటనలో ఇద్దరు మరణించగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.