మంచు మోహన్‌బాబుకు జీహెచ్ఎంసీ షాక్.. లక్ష జరిమానా
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు ఊహించని షాకిచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ఇంటికి ఎల్ఈడీ లైట్స్ తో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ పై భారీ జరిమానా విధించారు. ఆ అడ్వర్టైజ్ మెంట్ బోర్డుకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని బల్డియ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ఈ క్రమంలో మోహన్ బాబుకు లక్ష రూపాయిలు జరిమానా విధిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన నోటీసులు నేరుగా మోహన్‌బాబు ఇంటికే పంపించారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ ఫిలింనగర్‌లో అపోలో బస్టాప్‌కు దగ్గర్లో మోహన్ బాబు ఇల్లు ఉంది.
అయితే రోడ్డుపైనే అది కూడా మంచి సెంటర్‌లో ఇల్లు కావడంతో మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల తాలుకు ప్రకటనలన్నీ అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులో పెడుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతోంది. అయితే జీఎచ్ఎంసీ అధికారులు మాత్రం ఇప్పుడు స్పందించడం గమనార్హం. ఈ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుకు ఎలాంటి అనుమతులు లేవని తేల్చిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ జరిమానా విధించారు. అయితే ఈ జరిమానా విషయమై ఇప్పటి వరకూ మంచి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే నెటిజన్లు మాత్రం మంచు లక్ష్మిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనికి కారణం గతంలో మంచు లక్ష్మి చేసిన ఫిర్యాదులే కావడం గమనార్హం.
వినాయకచవితి సమయంలో రోడ్డు తవ్వారంటూ మంచు లక్ష్మి పదే పదే కేటీఆర్ దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లారు. ప్రస్తుతం నెటిజన్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఇటీవల బాగా రియాక్ట్ అవుతోంది. ఇటీవల ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ నిబంధనలను పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు రూ.88వేలు చెల్లించాలని ఇ-చలానా జారీ చేసింది. అలాగే తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి సైతం లక్షల్లోనే జరిమానా విధించింది. ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ ఓ వీరాభిమాని ఫ్లెక్సీలు వేయడంతో విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout