సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్: రోడ్డు కాంట్రాక్టర్‌పై కన్నెర్ర చేసిన జీహెచ్ఎంసీ, భారీ జరిమానా
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో టాలీవుడ్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై అప్పట్లో పలువురు సినీ ప్రముఖులు రకరకాల వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రేస్, ఓవర్ స్పీడ్ అంటూ సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనికి నిర్మాత బండ్ల గణేశ్, హీరో శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా యువత వేగం తగ్గించుకోవాలని, పెద్దవారు చెప్పే మాటలను పట్టించుకోవాలని నరేశ్ వాదిస్తున్నారు.
ఇంకొందరు మాత్రం రోడ్డును పరిశుభ్రంగా ఉంచని జీహెచ్ఎంసీపై కూడా కేసు పెట్టాలని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కోరారు. రోడ్డుపై ఇసుక వేసేందుకు కారణమైన నిర్మాణ సంస్థకు కూడా భారీ జరిమానా వేయాలని డిమాండ్లు వచ్చాయి. ఓవర్‌స్పీడుతో బైక్ నడిపినందుకు సాయి ధరమ్ తేజ్‌పై కేసు పెట్టినప్పుడు.. ఇసుక ఉన్నందుకు కారణమైన జీహెచ్ఎంసీ, నిర్మాణ సంస్థపై కూడా అదే విధంగా కేసులు పెట్టాలని మెగా అభిమానుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
అయితే, సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్‌కు అండగా నిలిచారు. ఆయన బాధ్యతగా హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ డ్రైవ్ చేశారని, తక్కువ వేగంతోనే వెళ్లారని మద్దతు పలికారు. రోడ్డుపై మట్టి లేదా ఇసుక ఉండడమే సాయి ప్రమాదానికి కారణమని తేల్చారు.
ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్పందించింది. ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తూ ఉంది. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపైనా కఠిన చర్యలు చేపడుతోంది. మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు తాజాగా జీహెచ్‌ఎంసీ రూ.లక్ష జరిమానా వేసింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు కొరడా ఝళిపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments