జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం సాయంత్రం వెల్లడించాయి. నిజానికి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రమే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారైన కారణంగా అక్కడ నేడు రీపోలింగ్ జరిగింది. దీంతో రీపోలింగ్ ముగిసేంత వరకూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. దీంతో నేటి సాయంత్రం రీపోలింగ్ ముగిసిన అనంతరమే ఎగ్జిట్ పోల్ ఫలితాలను సర్వే సంస్థలు వెలువరించాయి.
తాజాగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీయే జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి సర్వేలోనూ టీఆర్ఎస్దే హవాగా కనిపిస్తోంది. అయితే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు సాధించడమైతే కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోల్చుకుంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినట్టుగా సర్వేలు చెబుతున్నాయి.
పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 68-78(ఓట్ షేర్ 38%)
ఎంఐఎం 38-42 (ఓట్ షేర్ 13%)
బీజేపీ 25-35 (ఓట్ షేర్ 32%)
కాంగ్రెస్ 1-5 (ఓట్ షేర్ 12%) ఇతరులు- 5 శాతం ఓట్ షేర్
ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 78(+/-7).. (ఓట్ షేర్ 40.08%)
ఎంఐఎం 41(+/-5).. (ఓట్ షేర్ 13.43%)
బీజేపీ 28(+/-5).. (ఓట్ షేర్ 31.21% (+/-3))
కాంగ్రెస్ 3(+/-3).. (ఓట్ షేర్ 8.58 శాతం (+/-3))
థర్డ్ విజన్(నాగన్న) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 95-101(ఓట్ షేర్ 46.84%)
ఎంఐఎం 35-38 (ఓట్ షేర్ 14.04%)
బీజేపీ 5- 12 (ఓట్ షేర్ 26.50%), కాంగ్రెస్ 0-1 (ఓట్ షేర్ 9.29%)
సెంటర్ ఫర్ సెఫాలజీ(సీపీఎస్) జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 82-96(ఓట్ షేర్ 39.08%)
ఎంఐఎం 32-38 (ఓట్ షేర్ 13.04%)
బీజేపీ 12- 20 (ఓట్ షేర్ 27.09%), కాంగ్రెస్ 3-5 (ఓట్ షేర్ 14.07%)
హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 65-70, ఎంఐఎం 35-40, బీజేపీ 27- 31
కాంగ్రెస్ 3-6, ఇతరులు 3
జన్‌కీ బాత్ జీహెచ్ఎంసీ ఎగ్జిట్ పోల్స్
టీఆర్ఎస్ 74, బీజేపీ 31
ఎంఐఎం 40, ఇతరులు 5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments