బ్యాలెట్ ద్వారానే జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాలెట్ ద్వారానే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నాలుగు కేటగిరీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఈ ఎన్నికలకు డీలిమిటేషన్ లేదన్నారు. రిజర్వేషన్లు 2016 లోనివే కంటిన్యూ అవుతున్నాయని వెల్లడించారు.150 వార్డులకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లిస్ట్ ద్వారా మ్యాపింగ్ చేశామన్నారు. తాము రాజకీయ పార్టీలతో భేటీ అయ్యాకే తుది ఓటర్ల లిస్టును విడుదల చేశామన్నారు. ఎన్నికల బందోబస్తుకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పార్థసారధి వెల్లడించారు.
150 వార్డుల్లో కౌంటింగ్ కేంద్రాలు- స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయని పార్థసారధి తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ లిస్టును ఈ నెల 21న విడుదల చేస్తామన్నారు. కాగా.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులు ఎస్టీ, ఎస్సీ, బీసీ అయితే.. 2500, ఇతరులకు 5000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో ఫామ్ వెరిఫికేషన్ ఆన్లైన్‌లో చూసుకోవచ్చన్నారు. 48వేల మందితో ghmc ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. 1439 సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ 1004, క్రిటికల్ 257,మొత్తం 27వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 913 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను ఇప్పటి వరకూ గుర్తించామని పార్థసారధి వెల్లడించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పార్థసారధి తెలిపారు. ఫలితాలు విడుదల అయిన తరువాత 45 రోజుల్లో అకౌంట్స్ చూపించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే 3 ఏళ్లపాటు డిస్ క్వాలిపై చేస్తామన్నారు. జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారిని మొత్తంగా ఆరుగురిని నియమిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కి ఇద్దరు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని పార్థసారధి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్ పోస్ట్‌లను నిర్వహిస్తామన్నారు. 356 రూట్ మొబైల్ పార్టిస్, 131 స్ట్రైకింగ్ ఫోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలు బ్యాన్ చేయబడతాయన్నారు. ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ అందిస్తారని పార్థసారధి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout