నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నవంబర్ లేదంటే డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పందించారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చేసింది.

కాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వ‌హిస్తున్న‌ట్లు రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం ఇటీవల స్ప‌ష్టం చేసింది. గ్రేట‌ర్ ఎన్నికలను ఈవీఎంలు ద్వారా నిర్వహించాలా? లేదంటే బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలా? అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేక‌రించ‌గా.. మెజారిటీ రాజకీయ పార్టీలు బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వ‌హించాల‌ని కోరాయి. దీంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలనే యోచనకు వచ్చింది.

11 రాజకీయ పార్టీలకు ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. వీటిలో 8 పార్టీలు అభిప్రాయం తెలిపాయి. వీటిలో ఐదు పార్టీలు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరగా ఒక్క పార్టీ మాత్రం ఈవీఎం ద్వారా నిర్వహించాలని.. రెండు పార్టీలు ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదు. కాగా.. ఎన్నికల సంఘం లేఖలు రాయకున్నా కొన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. తెలంగాణలో గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మొత్తంగా 50 ఉన్నాయి. అందులో 26 పార్టీలు అభిప్రాయాలను తెలుపగా.. 3 పార్టీలు మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాయి. 13 పార్టీలు బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలని కోరాయి. మెజారిటీ పార్టీలన్నీ బ్యాలెట్‌కే ఓటు వేయడంతో ఎన్నికల సంఘం కూడా బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.

More News

క్రేజీ కాంబినేష‌న్‌...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తదుప‌రి సినిమా ఏంట‌నే దానిపై క్లారిటీ లేదు. అనుష్క ప‌లానా చిత్రంలో న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించిన పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఉన్న విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పళని స్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వమే

‘రంగ్ దే’ షెడ్యూల్ పూర్తి చేసిన నితిన్ అండ్ టీమ్‌

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది.

అటు సీక్రెట్ టాస్క్.. ఇటు బీబీ గ్రాండ్ హోటల్

నామినేషన్స్ అనంతరం జరిగిన సీన్స్‌తో షో స్టార్ట్ అయింది. ఏడుపులు.. ఓదార్పులు నామినేషన్ తరువాత కూడా కొనసాగాయి.

అదే సీన్ రిపీట్ చేస్తున్న నాగ్‌...!

కింగ్ నాగార్జున‌.. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు బిగ్‌బాస్ షోతో బిజీ బిజీగా ఉంటున్నాడు. స్టార్ హీరోస్‌లో ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసింది కూడా నాగార్జునే.