డిసెంబర్ 6న జీహెచ్ఎంసీ ఎన్నికలు
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబరు 6వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఆదివారం కావడంతో పోలింగ్‌కు ఆ రోజు అనుకూలంగా ఉంటుందని.. ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
చట్టం ప్రకారం చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లోనే ముగించాల్సి ఉంటుంది. అంట నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటి నుంచి 15 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. కాగా.. దీపావళి తరువాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని పార్టీల నేతలు ఇంతకుముందే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం లేదంటే ఈ నెల 20న గానీ షెడ్యూల్‌ను ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది.
అయితే తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. వరద ముంపు బాధితులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిుతులు పెద్ద సంఖ్యలో మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వారికి సహాయం అందించే క్రమంలో మరో రెండు, మూడు రోజులు పాటు షెడ్యూల్ విడుదల ఆలస్యమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ వారంలో గ్రేటర్ ఎన్నికల నగారా మోగే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout