డిసెంబర్ 6న జీహెచ్ఎంసీ ఎన్నికలు

  • IndiaGlitz, [Tuesday,November 17 2020]

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. డిసెంబరు 6వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 6న ఆదివారం కావడంతో పోలింగ్‌కు ఆ రోజు అనుకూలంగా ఉంటుందని.. ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలోనైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

చట్టం ప్రకారం చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 15 రోజుల్లోనే ముగించాల్సి ఉంటుంది. అంట నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటి నుంచి 15 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. కాగా.. దీపావళి తరువాత ఎప్పుడైనా గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడవచ్చని పార్టీల నేతలు ఇంతకుముందే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం లేదంటే ఈ నెల 20న గానీ షెడ్యూల్‌ను ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది.

అయితే తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. వరద ముంపు బాధితులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  బాధిుతులు పెద్ద సంఖ్యలో మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వారికి సహాయం అందించే క్రమంలో మరో రెండు, మూడు రోజులు పాటు షెడ్యూల్ విడుదల ఆలస్యమయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ వారంలో గ్రేటర్ ఎన్నికల నగారా మోగే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి.

More News

ఆ చిత్రాన్ని పవన్ సర్ చేయడం చాలా ఆనందాన్నిస్తోంది: చిన్మయి

తానొక సందేశాత్మక చిత్రాన్ని చూశానని.. అది తనకు ఎంతగానో నచ్చిందని సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారం..

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆది సాయికుమార్ హీరోగా ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై

సినిమా రేంజ్‌లో స‌మంత రెమ్యున‌రేష‌న్‌..!

ఇప్పుడు వెండితెర‌పై స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న వారంద‌రూ బుల్లితెర‌పై రియాలిటీ షోస్‌ల‌లో, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న టీవీ షోస్‌ల‌లోనూ న‌టిస్తున్నారు.

తెలుగు భాష గొప్ప‌తనాన్ని త‌మిళుల‌కి చెప్పిన క‌మ‌ల్‌

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాసన్.. ఇండియ‌న్ సినిమాల్లో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.