జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ ఫిక్స్!

జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం స్పీడ్ పెంచేసింది.

వీలైనంత త్వరగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీనికి పలు కారణాలు దుబ్బాక ఎన్నికల ఎఫెక్ట్ జీహెచ్ఎంసీపై పడకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది చేయగలిగితేనే బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతోంది. తద్వారా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ప్రభావం పెద్దగా లేకుండా జాగ్రత్త పడవచ్చనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. అలాగే వరద పరిహారాన్ని ప్రజలు మరువక ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దుబ్బాక జోష్‌తోనే జీహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను బీజేపీ రంగంలోకి దించేసింది. జీహెచ్ఎంసీని దక్కించుకుని.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలకు సంకేతాలివ్వనుంది. అలాగే ఈ విజయం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విజయానికి నాందిగా మారుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే రాష్ట్ర అధిష్టానం సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది.

More News

క్రాకర్స్‌పై నిషేధం... కేవలం రెండు రోజుల ముందా?

దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

సెట్స్‌లోకి బ‌న్నీ.. కాన్సెప్ట్ ఇదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

'మా వింత‌గాథ వినుమా' ప్రీ రిలీజ్

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌వుతుంది.

'రంగ్ దే' చిత్రం నుంచి 'ఏమిటో ఇది' తొలి గీతం విడుదల

యూత్ స్టార్ నితిన్ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల

సుధాకర్ కోమాకుల క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'రీసెట్'

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ' నువ్వు తోపు రా' తదితర చిత్రాలతో  కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల