జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం స్పీడ్ పెంచేసింది.
వీలైనంత త్వరగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీనికి పలు కారణాలు దుబ్బాక ఎన్నికల ఎఫెక్ట్ జీహెచ్ఎంసీపై పడకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది చేయగలిగితేనే బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతోంది. తద్వారా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ప్రభావం పెద్దగా లేకుండా జాగ్రత్త పడవచ్చనే ఆలోచనలో అధికార పార్టీ ఉంది. అలాగే వరద పరిహారాన్ని ప్రజలు మరువక ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ కూడా టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. దుబ్బాక జోష్‌తోనే జీహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను బీజేపీ రంగంలోకి దించేసింది. జీహెచ్ఎంసీని దక్కించుకుని.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలకు సంకేతాలివ్వనుంది. అలాగే ఈ విజయం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో విజయానికి నాందిగా మారుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే రాష్ట్ర అధిష్టానం సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com